TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందులలో తెలుగుదేశం జెండా: పురపోరులో సత్తా చాటిన సైకిల్.!

Published on: Wed Nov 4, 2026 9:42AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  సంచలనం నమోదైంది. వైసీపీ అధినేత జగన్  ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి  కంచుకోటగా, అడ్డాగా  ఉన్న పులివెందుల మున్సిపాలిటీని తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం  ఆ పార్టీకి ఇదే  తొలిసారి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై  13 వేల800  ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఊహించని పరాజయంతో వైకాపా శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లగా, కూటమి వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ ఎన్నికల్లో వార్డుల వారీగా కూడా కూటమి అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటారు. నామినేషన్ల దశ నుంచే పట్టు చాటిన తెలుగుదేశం కూటమి, ఎన్నికలు జరిగిన స్థానాలలోనూ సత్తా చాటి పులివెందులలో పసుపు జెండా ఎగురవేసింది.  ఒక పులివెందుల అనే కాదు.. జగన్ కు కంచుకోటగా భావించే కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం బలమైన పునాది వేసుకుంది.   బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు వంటి మునిసిపాలిటీలలోనూ జయకేతం ఎగురవేసింది.  

[TDP Create History in Pulivendula, TDP Alliance Victory, Jagan stronghold Pulivendula, TDP Win, Telugu One]