TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగాలపై ప్రభావం నిల్: గ్రీన్ కార్డ్ సస్పెన్షన్ పై టీసీఎస్.!

Published on: Fri Oct 9, 2026 10:58AM

ఐటీ దిగ్గజ కంపెనీల పీఈఆర్ఎస్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ సస్పెన్షన్ వేటు పడిన కంపెనీలలో ఒకటి అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పందించింది.  తమ కంపెనీ ఉద్యోగ వ్యూహంపై, కస్టమర్ ప్రాజెక్ట్‌లపై అమెరికా విధించిన ఈ గ్రీన్ కార్డ్ సస్పెన్షన్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.

గత రెండు సంవత్సరాల్లో తమ కంపెనీ తరఫున దాఖలు చేసిన పెర్మ్ (PERM) దరఖాస్తులు కేవలం సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయని, అంటే అతి తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు ఉన్నాయని టీసీఎస్ వెల్లడించింది. అందువల్ల ఈ తాత్కాలిక సస్పెన్షన్ తమ వ్యాపార కార్యకలాపాలను ఇసుమంతైనా దెబ్బతీయలేదని టీసీఎస్ పేర్కొంది.  అమెరికా ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని, ఏ అధికారిక ఆదేశాలనైనా పాటిస్తామని టీసీఎస్ పునరుద్ఘాటించింది.

 అమెరికా ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలను, ముఖ్యంగా ఇండియాకు చెందిన ఐటీ కంపెనీలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ తో పాటు  టీసీఎస్  పై పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (పీఈఆర్ఎమ్) పై  సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.  విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస అనుమతి లేదా గ్రీన్ కార్డ్ అందించడంలో ఈ పీఈఆర్ఎమ్  కీలకమైనది. అయితే అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో, సిస్టమ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేబర్ సెక్రటరీ   తెలిపారు.  

దీనిపై స్పందించిన టీసీఎస్..  అమెరికాలో తమ  వ్యాపార విధానాన్ని పూర్తిగా స్థానిక టాలెంట్ రిక్రూట్‌మెంట్‌పై ఆధారపడేలా రూపొందించుకున్నామని పేర్కంది. ఇందులో భాగంగానే అమెరికా వ్యాప్తంగా 31 కార్యాలయాలు, డెలివరీ సెంటర్‌లను ఏర్పాటు చేసి స్థానిక శ్రామిక శక్తిని వినియోగించుకోవడంలో ముందున్నామని వివరించింది.

అలాగే.. వచ్చే ఐదేళ్లలో అమెరికాలో అదనంగా మరో 15 వేల  మంది స్థానిక నిపుణులను నియమించుకోవాలనే  ప్రణాళికతో ఉన్నట్లు వివరించింది.  క్యాంపస్ రిక్రూట్‌మెంట్ మోడల్ ద్వారా స్థానికంగా నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తున్నామని, దీనివల్ల విదేశీ లేబర్ సర్టిఫికేషన్ల అవసరం తమకు చాలా పరిమితంగా ఉంటుందని టీసీఎస్ పేర్కొంది.  


[TCS On  Green Card Suspension, US PERM Ban, TCS US hiring, Nill Effect, Telugu One]