TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రెస్ కోడ్ వివాదం: ఆదిభట్ల టీసీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.!

Published on: Fri Nov 20, 2026 3:16PM

డ్రెస్ కోడ్ వివాదం రంగారెడ్డి జిల్లా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)  కార్యాలయం వద్ద గురువారం (నవంబర్ 20)ఉద్రిక్తతకు దారి తీసింది.  అయ్యప్ప దీక్షలో ఉన్న ఓ ఉద్యోగిని డ్రెస్ కోడ్ నిబంధనల పేరుతో కార్యాలయంలోకి అనుమతించకపోవడంపై పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్సలో ఉన్న భక్తులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిథులు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళణకు దిగాయి.  యాజమాన్య తీరును నిరసిస్తూ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. 

 దీక్షలో ఉన్న ఉద్యోగిని వెంటనే విధుల్లోకి అనుమతించాలని   డిమాండ్ చేశారు.   గత రెండేళ్లుగా టీసీఎస్‌లో పనిచేస్తున్న   ఉద్యోగి గురువారం  అయ్యప్ప దీక్షా వస్త్రాలతో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కంపెనీ డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించలేదంటూ గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఉద్యోగి మనీష్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు.   అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న విషయాన్ని రెండు నెలల క్రితమే కంపెనీ యాజమాన్యానికి స్పష్టంగా తెలియజేశానని మనీష్ పేర్కొన్నారు. 

అయినప్పటికీ గురువారం విధులకు హాజరైనప్పుడు డ్రెస్ కోడ్ పేరుతో ప్రవేశం నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెస్ కోడ్ పాటించని ఇతర ఉద్యోగులను  లోపలికి అనుమతిస్తున్నారని, అయ్యప్ప దీక్షలో ఉన్నందుకే తనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.   ఈ సమాచారం బయటకు పొక్కడంతో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల సభ్యులు ఆదిభట్లలోని టీసీఎస్ కార్యాలయం వద్దకు చేరుకుని ముట్టడికి ప్రయత్నించారు. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆదిభట్ల పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.   ఉద్యోగి చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిరసన కార్యక్రమం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు.   

ఇది కూడా చదవండి: ఎన్నికల సంఘం vs టీసీఎస్ వివాదం.. భారత ప్రజాస్వామ్యానికి ముప్పా.?​

కార్పొరేట్ కార్యాలయాల్లో డ్రెస్ కోడ్ నిబంధనలు, మతపరమైన దీక్షలు లేదా ఆచారాలకు సంబంధించిన అంశాలు తలెత్తినప్పుడు ఉద్యోగులు, యాజమాన్యాలు చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలని పరిశీలకులు అంటున్నారు.  ఆదిభట్ల ఘటనలో నిబంధనలు, ముందస్తు సమాచారం వంటి అంశాలపై విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వాస్తవం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. 

ఏది ఏమైనా అయ్యప్ప దీక్షా వస్త్రాలు ధరించాడన్న కారణంతో ఉద్యోగిని కార్యాలయంలోపలికి అనుమతించకపోవడం మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ ధార్మిక సంస్లల ప్రతినిధులు విమర్శిస్తున్నారు.  

మీకు నచ్చవచ్చు:   ఉద్యోగాలపై ప్రభావం నిల్: గ్రీన్ కార్డ్ సస్పెన్షన్ పై టీసీఎస్.!​

ఐటీ కంపెనీలో లైంగిక వేధింపులు...బలవంతపు మత మార్పిడి!

[TCS Adibatla,Dresscode, contravarsy,  Ayyappa Deeksha TCS employee, Tense, TCSoffice, TeluguOne]