TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తేక్కంపట్టి సబ్ జైల్ నుంచి 17 మంది ఖైదీలు పరార్: సిబ్బంది, అధికారులపై దాడి చేసి ఉడాయించిన వైనం.!

Published on: Tue Oct 27, 2026 11:53AM

తమిళనాడు  తేక్కంపట్టి సబ్‌జైలులో కట్టుదిట్టమైన భద్రతను ఛేదించి ఏకంగా 17 మంది   ఖైదీలు పరారైర ఘటన ఆ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  పక్కా ప్రణాళికతో ఈ ఖైదీలు పరారుకావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్మయానికి గురి చేసింది.  పరారైన ఖైదీల కోసం రాష్ట్ర వ్యప్తంగా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది పోలీసు యంత్రాంగం. 

అది పక్కన పెడితే ఒకే సారి 17 మంది ఖైదీలు పరారు అయిన సంఘటన వివరాల్లోకి వెడితే.. వీరందరూ ఒకే గదిలో బందీలుగా ఉన్నారు.  వీరు పక్క వ్యూహంతో  సోమవారం(అక్టోబర్ 26)  జైలు సిబ్బందిని బురిడీ కొట్టించారు. ఈ 17 మంది ఖైదీలలో ఒకడు..  మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు నటించడంతో పాటు ఉక్కిరిబిక్కిరి అవుతున్నానంటూ హడావుడి చేశారు. ఆ ఖైదీ పరిస్థితిని గమనించిన జైలు అధికారులు వెంటనే అతడికి సహాయం అందించి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించే ఉద్దేశంతో ఆ గది తలుపు తెరిచి లోనికి ప్రవేశించారు. 

జైలు అధికారులుఅధికారులు గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన క్షణంలోనే ఆ ఖైదీలందరూ ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు.  అనంతరం  ఆ ఖైదీలు నేరుగా జైలు ప్రధాన ద్వారం (మెయిన్ గేట్) గుండానే బయటకు పరుగులు తీశారు. రాత్రి సమయం కావడంతో పాటు తక్షణ సహాయం అందేలోపు వారంతా చీకటిలో కలిసిపోయారు. పరారైన వారందరూ ప్రధానంగా మధురై ప్రాంతానికి చెందినవారే .వందలాది మంది ఖైదీలు ఉండే ఆ సబ్‌జైల్‌లో ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు ఒక ముఠాగా ఏర్పడి తప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి భద్రతా వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు పరిశీలకులు. పరారైన ఖైదీల గాలింపు కోసం   16 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. మధురై, దిండిగల్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న కేరళలోని ఇడుక్కి జిల్లా పోలీసులకు కూడా పరారైన ఖైదీల చిత్రాలు, వివరాలను చేరవేశారు.

ఈ గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు ఇప్పటికే నలుగురు ఖైదీలను  అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన నిందితులు ఎక్కడికి పారిపోయారనే దానిపై కూపీ లాగుతున్నారు.   మిగతా ఖైదీలను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసు శాఖ చెబుతోంది.  ఈ  సంఘటనతో రాష్ట్రంలోని ఇతర జైళ్లలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరుగుతోంది. 

[Tamil Nadu Jailbreak, Theni Sub Jail,  17 Inmates  Escape, Tamil Nadu Police Manhunt, Telugu One]