మహిళను దారుణంగా చంపి శరీర భాగాలతో బిర్యానీ వండిన నిందితులు..!
Published on: Sun Aug 23, 2026 12:38PM

చెన్నైలో తీవ్ర కలకలం.. వెలుగులోకి నమ్మలేని నిజా నిజాలు..!
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సూట్‌కేస్ మిస్టరీ కేసును చెన్నై రైల్వే పోలీసులు ఛేదించారు. చెన్నైకి చెందిన ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను బిర్యానీ పాత్రలో పెట్టి వండిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
ఈ భయానక ఉదంతం ఆగస్టు తొలివారంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సాధారణ బోగీలో దుర్వాసన రావడంతో బయటపడింది. ఆగ్రా వద్ద నిలిచిన రైలులో తనిఖీలు చేయగా ఒక ఎరుపు రంగు సూట్‌కేస్‌లో మానవ అవయవాలు లభించాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
స్టేషన్లు పరిసర ప్రాంతాల్లో దాదాపు 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టారు. ఒక మహిళ, పురుషుడు ఆ ఎరుపు సూట్‌కేస్‌తో రైలు ఎక్కినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించి, వారిని అనుసరిస్తూ గూడువాంజేరిలోని నివాసానికి చేరుకున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. సదరు ఇంట్లో ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, ఆయన భార్య భాగమతి మాజిక్‌లతో పాటు హయాత్ నిషా అనే మహిళ నివసిస్తున్నారు. రైలులో లభించిన శరీర విడిభాగాలు హయాత్ నిషావేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
అనంతరం పోలీసులు అనుమానాస్పద ఇంటి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. ఇల్లంతా రక్తసిక్తమై ఉండగా, ఒక బిర్యానీ పాత్రలో రైస్‌తో పాటు మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. లభ్యమైన అవయవాలను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు నిషా నిందితులకు బంధువు అని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే హత్య చేయడానికి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మృతురాలి తల భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ నమ్మలేని దారుణ ఉదంతం స్థానిక ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. నిందితులు దొరికితేనే ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న లస్కర్ దంపతుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించారు.
Tamil Nadu Express murder case, Chennai crime news, suitcase murder case, Tamil Nadu police investigation, human body parts biryani


