పిట్ట కొంచం కూత ఘనం: తాడ్వాయి విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.!
Published on: Sun Sep 27, 2026 8:22AM

పిట్ట కొంచం కూత ఘనం అన్న సమెత అందరికీ తెలిసిందే. అదిగో ఆ సామెతకు అతికి నట్లు సరిపోతారు తాడ్వాయి విద్యార్థినులు. ఔను చదుకునే వయస్సులోనే వారు ఆవిష్కరించిన అద్భుతం గురించి తెలుసుకుంటే ఎవరైనా వారిని పిట్ట కొంచం కూత ఘనం అనే అంటారు. ఇంతకీ వారు ఆవిష్కరించిన అద్భుతమేంటంటే.. పక్షి కూతను బట్టి అది ఏ జాతికి చెందిందో చిటికెలో కనిపెట్టేసే సాంకేతికత.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినుల ఈ సరికొత్త ఆవిష్కరణ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న సంకల్పంతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య అధ్యయనం ప్రధాన లక్ష్యంగా తాడ్వాయిలోని పీఎంశ్రీ, టీజీఎస్‌డబ్ల్యూఆర్సి, జేసీ(జి) పాఠశాలలో ఈ సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారు
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో పాఠశాల ప్రాంగణంలో పక్షుల కిలకిలారావాలను రికార్డ్ చేసి, రాస్ప్‌బెర్రీ కృత్రిమ మేధస్సు సహాయంతో వాటి జాతులను కనిపెట్టే వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో ఏయే పక్షులు సంచరిస్తున్నాయి, ఏ కాలంలో వలస వస్తున్నాయి, అంతరించిపోతున్న అరుదైన జాతులు ఏమైనా ఉన్నాయా వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను విద్యార్థినులు విశ్లేషిస్తున్నారు.

కేవలం చదువు మాత్రమే కాకుండా, ప్రకృతిపై ప్రేమను పెంచుకుంటూ వారు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను సంపాదిస్తున్నారు. సమాజ శ్రేయస్సు, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా కలెక్టర్ అందించిన ప్రోత్సాహం తమ విద్యార్థినుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. గ్రామీణ ప్రాంత బాలికలు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం కావడానికి ఈ ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టు చక్కటి వేదికగా నిలుస్తోందని నిపుణులు అంటున్నారు.
[Tadvai Students Bird Identification, Bird Sound Detection, AI Bird Call Recognition, Eco Sense Bird Project, Student Innovation, Telugu One]


