TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ సర్కార్ కు సుప్రీం నోటీసులు: ఎందుకో తెలుసా.?

Published on: Wed Oct 14, 2026 11:55AM

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీలను సమీప  మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో విలీనంపై దేశ సర్వోన్నత న్యాయస్ధానం ఏపీ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన  పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. స్థానిక సంస్థల పరిధి విస్తరణ ప్రక్రియలో భాగంగా పలు గ్రామాలను ఏకపక్షంగా కలిపేశారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ముందు దీనిపై వివరణ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

గ్రామ పంచాయతీలను విలీనం చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం  నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం,  విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయడానికి కానీ,  జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధించడానికి కానీ నిరాకరించింది.

ఈ విషయంలో  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం,  మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాల భవిష్యత్,  ప్రక్రియ  తాము ఇవ్వబోయే తుది తీర్పుకే లోబడి ఉంటుందని  స్పష్టం చేసింది.  గతంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల రూపురేకలను మార్చేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం పలు గ్రామీణ ప్రాంతాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.   


[Supreme Court Notices AP Governmeny, AP Village Merger, Supreme Court AP Govt Notice, AP Municipalities Merger, Gram Panchayats, Telugu One]