మతి ఉండే చేస్తున్నారా: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీం ఫైర్.!
Published on: Thu Oct 29, 2026 9:37AM

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తొలగించిన పేర్లు, దరఖాస్తుల దాఖలుకు సంబంధించిన విధివిధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కంది. ఢిల్లీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగిపోవడం, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించుకోవడానికి అనుసరిస్తున్న పద్ధతులపై సర్వోన్నత న్యాయస్థానం ఈసీఐపై సుప్రీం కోర్టు ఫైర్ అయ్యింది. . ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉండి, ముసాయిదా జాబితాలో పేర్లు కోల్పోయిన పౌరులు తిరిగి నమోదు కోసం ఫామ్-6 సమర్పించాలని ఈసీ కోరడంపై న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఓటరుగా నమోదై ఉన్న పాత ఓటర్లను కొత్త ఓటర్ల మాదిరిగా ఫామ్6 నింపాలని కోరడం సబబు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫామ్6 అనేది సాధారణంగా కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఉపయోగిస్తారనీ, పాత ఓటర్లను ఫామ్ 6 నింపాలని కోరడమంటే తప్పుడు డిక్లరేషన్ ఇవ్వమనడమేననీ సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అసలీ విధానాలను మతి ఉండే తీసుకువచ్చారా అని నిలదీసింది.
ఈ అంశంపై ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు వేలాదిగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించామని, బూత్ స్థాయి అధికారులను రంగంలోకి దించామని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, చాలా మందికి ఎన్యుమరేషన్ ఫారాలు సకాలంలో అందలేదని పిటిషనర్లు తెలిపారు. తొలగించబడిన ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్చుకునేందుకు వీలుగా సరైన ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కోర్టు ఈసీకి స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం చేపట్టిన ముసాయిదా జాబితా తయారీ, ఓట్ల తొలగింపు ప్రక్రియలో తార్కిక అసమానతల వర్గీకరణ చట్టబద్ధతపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఇటువంటి విషయాలలో పౌరులపై అనవసరమైన భారాన్ని మోపకుండా, ఎన్నికల సంఘమే స్వయంగా ప్రజలను సంప్రదించేలా ఒక పటిష్టమైన యంత్రాగాన్ని రూపొందించాలని సూచించింది. బూత్ స్థాయి అధికారుల ద్వారా సరైన డాక్యుమెంట్లతో ఫారాలను స్వీకరించాలని, అర్హులైన ఎ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి అన్యాయంగా తొలగిపోకుండా చూడాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ లోపు ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆశించింది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే దిశగా పారదర్శకమైన విధానాలను అనుసరించాలని ఆదేశించింది.
[Supreme Court Fire Election Commission of India, ECI, Voter List Deletion, Form 6, Delhi Electoral Rolls, Telugu One]


