TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్: ఈ ఏడాది చలికాలం గాయబ్.!

Published on: Mon Sep 28, 2026 12:49PM

 

పర్యావరణ కాలుష్యం, చెట్ల నరికివేత కారణంగా  మారుతున్న వాతావరణ పరిస్థితులు రుతుక్రమాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితి ముందు ముందు మరిన్ని పెను విపత్తులకు దారి తీస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.    పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటం వల్ల ఏర్పడుతున్న ఈ ఏడాది ఏర్పడిన సూపర్ ఎల్ నినో ప్రభావంతో దేశం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంంటున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్ ఎల్ నినో వర్షా భావ పరిస్థితులకు కారణమవ్వడమే కాకుండా.. ఈ ఏడాది శీతాకాలాన్ని కూడా మాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే సూపర్ ఎల్ నినో వర్షాలపైనే కాకుండా శీతాకాలంపై కూడా భారీ ఎఫెక్ట్ చూపుతుందన్నమాట. సూపర్ ఎల్ నినో కారణంగా  రుతుపవనాలు దెబ్బతినడమే   శీతాకాలం కూడా పూర్తిగా కనుమరుగైపోయే దుస్థితిని తీసుకువస్తుందని అంటున్నారు.  

 ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు  నైరుతి రుతుపవనాలను బలహీనపరిచాయి. దీంతో సాధారణంగా వర్షాకాలంలో వరుస తుపానులతో సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు ముఖం చాటేశాయి. గాలి వేడెక్కడం వల్ల యాంటీ తుపాను వావాతరణం ఏర్పడింది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

వర్షాలు కురవాల్సిన కాలంలో మండు వేసవిని తలపించేలా వాతావరణం మారిపోయిన సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాల చివరి దశలో  వర్షాలు కురిసి ఒకింత ఉపశమనం కలిగినా.. దేశ వ్యాప్తంగా నమోదైన లోటు వర్షపాతం సాగుపై, తాగు నీటిపై ప్రతికూల ప్రభావం చూపింది. చూపుతోంది. చూపుతుంది కూడా. ఈ సూపర్   ఎల్ నినో కారణంగా చలికాలంలో సైతం వేసవి వాతావరణమే నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  చలి వణికించే కాలంలో కూడా రోహిణీ కార్తెను తలపించే ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ పేర్కొంది.  ఇప్పటికే ఖరీఫ్ సాగును దెబ్బతీసిన  వాతావరణ మార్పులు,   రబీపై కూడా  ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. 

పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసమే ఇందుకు కరాణమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.   అభివృద్ధి,  రహదారుల విస్తరణ పేరిట నగరాలు, పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు మేలుకుని.. పచ్చదనాన్ని పరిరక్షించకుండా భవిష్యత్ తరలాకు ఎండాకాలం వినా మరో కాలమే లేకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. 
 శాస్త్ర సాంకేతిక రంగాలలో  ఎంతటి  ప్రగతి సాధించినా,  ప్రకృతి సమతుల్యత విషయంలో  రాజీపడితే మాత్రం మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.  


[Super El Nino, Environmental destruction, climate change, Winter season,  disappear, TeluguOne]