TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Suman: 170 ఎకరాల భూమిని దానం చేసిన సుమన్.. వాల్యూ ఎంతో తెలుసా!

Published on: Thu Jul 9, 2026 12:26PM

 


చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కి పోటీ ఇస్తూ తెలుగు సినిమాపై తన సిగ్నేచర్ ఉండేలా చేసిన హీరో సుమన్(Suman).. సుమన్ లాంటి అందగాడు తన భర్తగా రావాలని కోరుకున్న లేడీ అభిమానులకైతే లెక్కే లేదు. ఈ ఒక్క మాట చాలు సుమన్ చరిష్మా ఏ విధంగా కొనసాగిందో చెప్పుకోవడానికి. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం తన సత్తా చాటుతున్న సుమన్ గురించి రీసెంట్ గా బయటకి వచ్చిన న్యూస్ వైరల్ గా మారడమే కాకుండా సుమన్ గొప్పతనాన్ని చాటి చెప్తుంది.

చాలా ఏళ్ల క్రితం సుమన్ భవిష్యత్తు అవసరాలు, సినిమా కెరీర్‌ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న భువనగిరి ప్రాంతంలో 170 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో  భారీ సినిమా స్టూడియోని  నిర్మించాలని, ఆ తర్వాత దానిని కమర్షియల్‌గా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనేది ఆయన ప్లాన్. అయితే అదే సమయంలో కార్గిల్ యుద్ధం జరగడం, దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ వందలాది మంది భారత జవాన్లు వీరమరణం పొందడం సుమన్‌ని  తీవ్రంగా కదిలించింది. టీవీల్లో, వార్తల్లో అమరవీరుల కుటుంబాలు పడుతున్న బాధలను, వారి దీన స్థితిని చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ వీరుల కుటుంబాలకు తన వంతుగా ఏదైనా శాశ్వతమైన సహాయం అందించాలని  నిశ్చయించుకున్నారు.


Also read: లెనిన్ బాక్సాఫీస్ టార్గెట్..అఖిల్ హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు రాబట్టాలా?

 భువనగిరిలో ఉన్న తమ 170 ఎకరాల విలువైన భూమిని దేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనికుల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తే బాగుంటుందని సుమన్ కి భార్య  సూచించారు. భార్య ఇచ్చిన సలహా సుమన్‌కి ఎంతో నచ్చింది. వందల కోట్ల కమర్షియల్ విలువ ఉన్న భూమి అని కూడా ఆలోచించకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ 170 ఎకరాల భూమిని పూర్తిగా భారత సైనికుల, అమర జవాన్ల కుటుంబాల అవసరాల కోసం రాసిచ్చేశారు. కుడిచేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదనే సామెతను నిజం చేస్తూ, ఇంత పెద్ద దానాన్ని ఆయన ఎప్పుడూ మీడియా ముందుగానీ, సినిమా ఇండస్ట్రీలోగానీ ప్రచారం చేసుకోలేదు. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగా సుమన్ స్వయంగా స్పందిస్తూ ఆనాటి సంఘటనని  ధృవీకరించారు. అంతేకాదు, ఈ గొప్ప నిర్ణయం వెనుక తన భార్య ఆలోచనే ప్రధాన కారణమని ఎంతో వినమ్రంగా చెప్పారు.  దీంతో  ఇప్పుడు అభిమానులతో పాటు ప్రతి ఒక్క ఇండియన్ సుమన్‌ కి సెల్యూట్ చేస్తున్నారు.

suman, tollywood, 170 acres