మోడీ జన్మదినం సందర్భంగా శైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపిన సుదర్శన్ పట్నాయక్.!
Published on: Thu Sep 17, 2026 10:23AM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ సముద్ర తీరంలో ఆకర్షణీయమైన కళాఖండాన్ని రూపొందించారు. ఆయన ప్రజాప్రతినిధిగా దేశానికి మోదీ అందిస్తున్న సేవలను మరియు ఆయన నాయకత్వ పటిమను గౌరవిస్తూ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పానికి ఆశీర్వాద్ కా దియా.. 25 ఇయర్స్ ఆఫ్ సేవా,, హ్యాపీ బర్త్‌డే మోదీ జీ అనే వ్యాఖ్య జోడించారు.
సుమారు 25 అడుగుల పొడవుతో తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పం చుట్టూ సుమారు పాతిక వందల మట్టి దీపాలను అలంకరించారు. ఈ దీపాల వెలుతురులో సముద్ర తీరం అద్భుతమైన కాంతులీనుతూ సందర్శకులను కట్టిపడేసింది. శైకత శిల్ప కళతో పాటు దీపాల కాంతులను మేళవించి రూపొందించిన ఈ విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ కళాకృతి రూపకల్పన వెనుక సంఖ్యాపరమైన ప్రాధాన్యత ఉందని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. మోదీ రాజకీయ, పరిపాలనా రంగంలో న్నికైన ప్రజాప్రతినిధిగా విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న మైలురాయిని ఈ పాతిక అడుగుల పొడవైన ఇసుక శిల్పం సూచిస్తుంది. అదేవిధంగా, అమర్చిన 2500 దీపాలు దేశ ప్రజలు ఆయనకు అందిస్తున్న ప్రార్థనలు, దీవెనలు, అభినందనలు, శుభాకాంక్షలకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన వివరించారు.
[Sudarsan Pattnaik sand art, PM Modi birthday celebrations, Puri beach sand sculpture, Narendra Modi public service 25 years, 2500 diyas sand installation, Telugu One]


