డొనాల్డ్ ట్రంప్ ఎంత‌టి శృంగార‌పురుషుడంటే... ఇరికించిన శృంగార తార!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలంటే పడి చచ్చే ట్రంప్‌,  వారితో శారీరక సంబంధాల్ని కొన‌సాగించేవాడు. అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు ప‌లువురు స్త్రీల‌తో శారీర‌క సంబంధాన్ని నెరిపిన ట్రంప్ ఆ త‌రువాత అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ..తాను స‌న్నిహితంగా ఉన్న మ‌హిళ‌లంద‌రిని దూరంగా పెట్టాడు. ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వ‌గా.. ఇప్పుడిప్పుడే ఇత‌ర స్త్రీల‌తో నెరిపిన అక్ర‌మ‌సంబంధాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

గతంలో ట్రంప్ ఓ శృంగార తార వెంటపడ్డారు. ఆమె అమెరికాలో పేరు ఉన్న పెద్ద పోర్న్‌ స్టార్‌. ఆమెతో ఒకటి రెండు సార్లు ఆయన తన రాస‌లీల‌లు కొనసాగించారు.  ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌కుండా వుండ‌టానికి తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు  ఆమెకు పంపి- ‘మన బంధంపై నోరెత్తవద్దు’ అని కోరారు. ఆమె ఆయన చెప్పినట్లే ఆయనతో సెక్స్‌ బంధంపై మౌనం దాల్చింది. కానీ ఈ చెల్లింపు మాత్రం బయటకు పొక్కింది. ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ గుట్టు ర‌ట్టు చేసింది. ట్రంప్‌ను తానెలా కలిసిందీ.. ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందీ తదితర వివరాలను కోర్టులోని జ్యూరీ సభ్యులకు ఆమె తెలిపారు.  అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ట్రంప్ త‌న‌ అంగరక్షకుడి ద్వారా డిన్నర్‌కు ఆహ్వానం పంపారు.  ఆయ‌న హోటల్‌ గదికి వెళ్లాను. అప్పుడు ఆయన సిల్క్‌ దుస్తుల్లో ఉన్నారు. ఆయన వస్త్రధారణ చూసి నాకు నవ్వొచ్చింది. దాంతో ఆయన షర్ట్‌, ప్యాంట్‌ వేసుకున్నారు. నేను బాత్రూమ్‌కు వెళ్లాను. తిరిగి వచ్చేసరికి ఆయన టీషర్ట్‌, షార్ట్‌లోకి మారిపోయారు. అప్పుడే ట్రంప్‌ భార్య ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్‌ లేకుండానే ట్రంప్‌ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్‌ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్‌ చెప్పారు. 

ట్రంప్‌తో సంభోగాన్ని బయటపెట్టకుండా ఉండేదుకు 2016 ఎన్నికల సమయంలో 1 ల‌క్షా 30 వేల డాలర్ల మొత్తాన్ని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి స్వీకరించానని తన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. 2006లో తాను ట్రంప్​తో లైంగికంగా కలిసినట్టు ఆమె​ తెలిపారు. ఇది ట్రంప్​ మూడో పెళ్లి మిలానియాతో జరిగిన ఏడాది అనంతర ఘటన! సరిగ్గా ఇక్కడి నుంచి దశాబ్ద కాలం తర్వాత డొనాల్డ్​ ట్రంప్​.. అమెరికా అధ్యక్షుడయ్యారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌