జగన్‌కి ఓటేస్తే మీ ఆస్తి రాసిచ్చినట్టే!

రైతుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయాలని జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలతో వున్న నేపథ్యంలో, ఈసారి ఎన్నికలలో జగన్‌కి ఓటే్స్తే మీ ఆస్తి జగన్‌కి రాసిచ్చినట్టే అని చెప్పే స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘‘2024 సంవత్సరం, మే నెల 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు తెలిసి విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం’’ అంటూ జగన్ ఫొటో వాటర్‌ మార్కుగా వున్న వంద రూపాయల స్టాంపు పేపర్ మీద రాసి వుంది. స్టాంపు పేపర్ మీద జగన్ ఫొటో, ఫ్యాన్ గుర్తు, మరోపక్క లాండ్ టైటిలింగ్ యాక్ట్.కి సంబంధించిన లోగో వుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ స్టాంప్ పేపర్ మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది.