TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం చంద్రబాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం..!

Published on: Sat Sep 12, 2026 11:43AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుకు టీటీడీ అధికారికంగా ఆహ్వానం అందించింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకిదేవీ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రి కి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు వివరంగా చర్చించారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. 

ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, వసతి, అన్నప్ర సాదం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటం తో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికా రులకు సూచించారు. 

భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం సన్నద్ధమవు తోందని అధికారులు సీఎం కి వివరించారు.

 

 

[ Srivari Salakatla Brahmotsavam, TTD Board Chairman B.R. Naidu, CM Chandrababu Naidu, TTD EO Muddada Ravichandra, TTD, Srivari ]