శ్రీశైలం ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు: తప్పిన పెను ప్రమాదం.!
Published on: Thu Sep 24, 2026 2:14PM
.webp)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘాట్ రోడ్డులో భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి.
కొండచరియలు విరిగి పడిన ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో జగరడంతో పెను ప్రమాదం తప్పింది.కొండచరియలు విరిగిపడిన సమయంలో ఆ దారిలో జనసంచారం లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఒకవేళ రద్దీగా ఉండే పగటిపూట ఈ ఘటన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేది. కాగా రోడ్డు మధ్యలో భారీ రాళ్లు, మట్టి పెళ్లలు విరిగిపడిన సంఘటన ఆందోళన కలిగిస్తున్నది.

అదలా ఉంటే.. అధికారులు రోడ్డుకు అడ్డంగా పడిన కొండచరియలు, రాళ్లు మట్టిని యుద్ధ ప్రాతిపదికన జేసీబీల సాయంతో తొలగించి, ఆ దారిలో రాకపోకలను పునరుద్ధరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తీరం దాటినా కూడా తీవ్ర వాయుగుండం ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. రానున్న రెండు రోజులు పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అధికారులు స్పష్టం చేశారు. ఎడతెరపిలేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణికులు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప ఘాట్ రోడ్లు, కొండ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
[Srisailam, Hyderabad, Ghat Road, Highway, landslides, Heavy Rains, Telugu One]


