TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..!

Published on: Fri Sep 4, 2026 2:25PM

 

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో విమానం పార్కింగ్ బేలోకి వెళ్తుండగా అక్కడ ఏర్పాటు చేసిన విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) పోల్‌ను ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం సుమారు 9.02 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండిగోకు చెందిన 6E 225 విమానం (VT-NOG)ను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులోని బే నంబర్‌ 6లో పార్కింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 

విమానం పోల్‌ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గుర య్యారు. అయితే అదృష్ట వశాత్తూ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. ఘటన అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని విమానం నుంచి సురక్షితంగా దించేశారు. ఇందుకోసం మాన్యువల్ మెట్లను వినియోగించారు. ప్రమాదంలో విమానానికి నష్టం జరిగినట్లు నివేది కలు పేర్కొన్నప్పటికీ, ఘట నకు గల ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

పార్కింగ్ సమయంలో విమానం VDGS పోల్‌ను ఎలా ఢీకొట్టిందన్న అంశంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనకు గల కారణంపై ఎలాంటి నిర్ధారణకు రాలేమని అధికా రులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయి.

 

 

(Srinagar Airport, IndiGo flight Accident, Airplane VDGS Poll, Aircraft accident, VDGS pole collision, Flight 6E 225, Mumbai to Srinagar flight Telugu News, Telugu One)