టెక్కలి వద్ద ఘోర రైలు ప్రమాదం: నలుగురు యువకులు దుర్మరణం..!
Published on: Wed Sep 23, 2026 4:20PM

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు నలుగురు నిండు ప్రాణాలను బలిగొంది. టెక్కలి ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని బర్మా కాలనీ పరిసర ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కొందరు విద్యార్థులు యువకులు రైల్వే మార్గం వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ అపశృతి ఎదురైంది. అదే మార్గంలో వేగంగా దూసుకొచ్చిన రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు వారిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
.webp)
ఈ ఊహించని ప్రమాద తీవ్రతకు నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం..విద్యార్థులుగా గుర్తించారు. వారు హాస్టల్‌లోంటూ లేదా ఇతర వ్యక్తిగత పనుల నిమిత్తం ఆ ప్రాంతానికి వచ్చి, రైలు పట్టాలపై లేదా పక్కన నడుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ దుర్ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో మృతులు రైలు వస్తున్న విషయాన్ని గమనించలేకపోవడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఇలాంటి రైల్వే ట్రాక్ల వెంబడి నడవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రాణాల మీదకు తెస్తుందని అధికారులు మరోసారి హెచ్చరిస్తున్నారు. పట్టాల దాటేటప్పుడు లేదా నడిచేటప్పుడు తగిన అప్రమత్తత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర రోదనలు మిగిలాయి. పండగ చేసుకునే వయసులో ఉన్న యువకులు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రైల్వే ట్రాక్ సమీపంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
[ Srikakulam train accident, Tekkali news, AP train accident, Rajya Rani Express accident, students dead, Telugu One, Telugu News ]


