ఫ్యాక్షన్ వెనక్కు, ప్రగతి ముందుకు: సీమలో బెల్ భారీ ప్లాంట్.!
Published on: Mon Oct 26, 2026 12:11PM

తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఫ్యాక్షన్ ముద్రను చెరిపేసుకుంటోంది. ఫ్యాక్షన్ సంస్కృతికి మారుపేరుగా గుర్తింపు పొందిన రాయలసీమ ఇప్పుడు పారిశ్రామికంగా ప్రగతి బాటలో పరుగులు తీస్తోంది. తాజాగా రాయలసీమలోని సత్యసాయి జిల్లా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడానికి సర్వం సిద్ధమైంది. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన రాయలసీమ నేలపై ఇప్పుడు దేశ రక్షణకు అవసరమైన అత్యాధునిక క్షిపణులు, రాడార్లు రక్షణ సాంకేతిక పరికరాల తయారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇండియన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఈ జిల్లాలో సుమారు పాతిక వందల కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి రక్షణ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. .
పాలసముద్రం ప్రాంతంలో 914 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంట్‌లో క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, వాటికి సంబంధించిన కీలకమైన పరీక్షా పరికరాల ఉత్పత్తి జరగనుంది. 1956 నుంచి దేశ రక్షణ రంగ సేవల్లో క్రియాశీలకంగా ఉన్న బీఈఎల్, ప్రస్తుతం 350కి పైగా స్వదేశీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రసిద్ధ ఆకాశ్ క్షిపణి వ్యవస్థల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న బెల్ పాలసముద్రం యూనిట్ ద్వారా సరికొత్త సాంకేతికతలను అందుబాటులోకి తేనుంది.
ఈ యూటిన్ ఏర్పాటుతో 800 మందికి గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ రక్షణ పరిశ్రమ ఆధారంగా పనిచేసే పలు అనుబంధ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఇక్కడ కొలువుదీరనున్నాయి. దీనివల్ల శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కేవలం బెల్ ప్లాంట్ మాత్రమే కాకుండా, ఈ ప్రాంతాన్ని సమగ్ర రక్షణ కారిడార్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా పుట్టపర్తి పరిధిలోని 350 ఎకరాల్లో డిఆర్డిఓ ఆధ్వర్యంలో విమానాల సమీకృత, ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకానుంది. ఇది దేశానికే అత్యంత ప్రాధాన్యమైన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాష్ట రక్షణ కార్యక్రమానికి వేదికగా నిలవనుంది. ఇంకా మడకశిర ప్రాంతంలో కూడా పలు రక్షణ ఆధారిత కంపెనీలు తమ ప్రాజెక్టులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
[Sri Sathya Sai District As Defense Hub, Bharat Electronics Limited, Palasamudram, DRDO Puttaparthi Complex, Employment, Telugu One]


