శ్రీ సిటీలో పారిశ్రామిక వాడలో ప్రమాదం: ఐదుగురు మృతి.. పది మందికి పైగా గాయాలు.!
Published on: Sat Oct 3, 2026 1:05PM

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పరిధిలోని శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఈ తెల్లవారు జామున సంభవించిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఫార్మాసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు ముప్పై మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి షిఫ్ట్ ముగిసిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలోని పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
.webp)
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు.

ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకుమెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
.webp)
[Sri City boiler blast, Factory accident, Til Healthcare Explosion, Andhra Pradesh, Workers Death, Telugu One]


