TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీమ్ కేజ్రీవాల్ ఏంటి?.. బొద్దింకల పార్టీలో చీలిక.!

Published on: Fri Sep 4, 2026 11:42AM

నీట్ పేపర్ లీక్ వంటి   సమస్యలపై దేశవ్యాప్తంగా శక్తిమంతమైన ఉద్యమాన్ని నడిపి, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన బొద్దింకల పార్టీ కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక సంభవించింది.  కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..  ఆ పార్టీ కీలక నేత మనీష్ బ్రహ్మభట్  కాక్‌రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డి) పేరుతో  కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆయన ప్రస్తుత   సీజేపీ నాయకత్వం, ముఖ్యంగా అభిజీత్ దిప్కే బృందం ప్రజా ఉద్యమాన్ని రాజకీయమయం చేసిందని దుయ్యబట్టారు. అభిజీత్ దిప్కే వర్గం సీజేపీని  టీమ్ కేజ్రీవాల్'గా మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గురువారం (సెప్టెంబర్ 3) తన కొత్త పార్టీ సీజేపీ-డిని అధికారికంగా ప్రకటించిన  మనీష్ బ్రహ్మభట్  మీడిమాతొ మాట్లాడుతూ..  దేశంలోని సాధారణ ప్రజల చెమట, రక్తంతో సాధించిన నీట్ విజయాన్ని, ఉద్యమాన్ని  అభిజీత్ దిప్కే వర్గం తమ స్వార్థం కోసం అమ్మేశారని   విమర్శించారు. కేవలం 12 మంది ఒక ఇంట్లో కూర్చుని రహస్యంగా జాతీయ స్థాయి జట్టును  ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు ఆ సంస్థ పూర్తిగా  టీమ్ కేజ్రీవాల్ గా మారిపోయిందన్నారు. 

గతంలో అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలోనూ అరవింద్ కేజ్రీవాల్ సరిగ్గా ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడు సీజేపీ నాయకత్వం ఏర్పాటు వెనుక కూడా  కేజ్రీవాల్ హస్తం ఉందనీ బ్రహ్మభట్ ఆరోపించారు.   అభిజీత్ దిప్కే గతంలో ఆప్ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన నేపథ్యం ఉండటం.. జంతర్ మంతర్ వద్ద బొద్దింకల ఉద్యమానికి కేజ్రీవాల్ మద్దతు తెలపడం. నేపథ్యంలో.. ఇప్పుడు మనీష్ బ్రహ్మభట్ చేసిన  ఆరోపణలకు బలం చేకూర్చాయి.  తాము తాజాగా ఏర్పాటు చేసిన సీజేపీ-డిలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తామన్న మని మనీష్ బ్రహ్మభట్..  సాధారణ వాలంటీర్లకు కూడా ఓటు హక్కు కల్పించి, అందరి భాగస్వామ్యంతో పార్టీని ముందుకు నడిపిస్తామన్నారు.  

[Split in Cockroach Janata Party, CJP split, Manish Brahmbhatt, Abhijeet Dipke, CJP Democratic, Team Kejriwal, Telugu One]