TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు కేసులో ట్విస్ట్..!

Published on: Thu Sep 10, 2026 8:15PM

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయా లని కోరుతూ సైఫాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. బెయిల్ సమయంలో కోర్టు విధిం చిన షరతులను ఎమ్మెల్సీలు ఉల్లంఘించారని పోలీసులు తమ పిటిషన్‌ లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేసే సమయంలో మీడియాతో మాట్లాడవద్దని కోర్టు షరతు విధించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ షరతు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

కోర్టు విధించిన షరతు లను ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకో వాలని పోలీసులు కోర్టును కోరారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలపై నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు బదిలీ చేయాలని కూడా సైఫాబాద్ పోలీసులు కోరారు. కేసు విచారణను సంబంధిత ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని, వారిపై తగిన చర్యలు తీసుకో వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు మరోసారి కీలకంగా మారింది.పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

 

 

[ Speaker Gaddam Prasad, MLCs Tata Madhu and Naveen Reddy, CM Revanth reddy, Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]