Latest News

గౌతం గంభీర్ కు దాదా ఫ్రెండ్లీ వార్నింగ్!

posted on: Mar 24, 2026 12:45PM

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ కు మాజీ కెప్టెన్ దాదా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జట్టు విజయాల కోసం నిరంతరం శ్రమిస్తున్నాడంటూ కితాబిస్తూనే వ్యవహార తీరు మార్చుకోవాలంటూ హెచ్చరిక లాంటి సూచన చేశాడు. 

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ విజయాలతో గౌతం సక్సెస్ ఫుల్ కోచ్ గా క్రీడాభిమానుల కితాబులందుకుంటున్నాడు. అయితే గంభీర్ వ్యవహార శైలి మాత్రం పలు సందర్భాలలో వివాదాస్పదంగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో విభేదాలూ, జట్ట క్రీడాకారులతో వ్యవహరించే తీరు, టీమ్ కూర్పు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం ఆయనను వివాదాలకు కేంద్ర బిందువుగా చేసిన సంగతి విదితమే. 

మైదానంలో దూకుడు జట్టుకు మేలు చేస్తుంది కానీ, ఒక కోచ్ అలా ఉండాల్సిన అవసరం లేదని సౌరవ్ గంగూలీ గౌతం గంభీర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గంభీర్ వ్యక్తిత్వంపై తనకున్న అవగాహనతో  ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్న గంగూలీ మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.  హెడ్ కోచ్ గా ఇప్పటి వరకూ గౌతం గంభీర్ సాధించిన విజయాలను ప్రస్తుతిస్తూనే ముందు ముందు గంభీర్ మరిన్ని సవాళ్లకు సిద్ధం కావాలన్నాడు.  2027 వన్డే ప్రపంచకప్ గంభీర్ ముందున్న ప్రధాన లక్ష్యమనీ, ఆ టోర్నీలో విజయాన్ని అందుకోవాలంటే గంభీర్ వివాదాలకు దూరంగా ఉంటూ, తన వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉందని హితవు పలికాడు.   ఆటగాళ్లతో మరింత ఫ్రెండ్లీగా మెలగాల్సి ఉంటుందని సలహా ఇచ్చాడు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...