నేపాల్ కు భారత్ అందిస్తున్న సాయంపై సోనూసూద్ ఏమన్నారంటే?
Published on: Wed Sep 2, 2026 2:25PM
.webp)
జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్ లో బాధితులను నేరుగా పరామర్శించి, సహాయం అందించేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఆ దేశంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా అక్కడి వాస్తవ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన జల ప్రళయంలో తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్' ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. నీట మునిగిన గ్రామాలు, కొట్టుకుపోయిన ఇళ్లు, సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో పొరుగు దేశానికి ధైర్యం చెప్తూనే, ప్రధాని మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ప్రశంసించారు.
నేపాల్‌లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందనడానికి అక్కడి దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయన్న సోనూ సూద్.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే గుండె తరుక్కుపో తోందన్నారు.

అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి చాలా సమయం పడుతుందనీ, ఇది కొద్ది వారాల్లోనో నెలల్లోనో తీరే సమస్య కాదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌కు అందిస్తున్న తక్షణ సాయం అభినందనీయమన్న సోనూసూద్.. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ మానవీయ సహాయం సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు.
[Sonu Sood Visit Nepal Flood Effected Areas, Nepal Floods, PM Modi Aid to Nepal, Trishuli Bazaar Nepal, Nepal Rescue Operations, Sonu Sood Praises Modi]


