వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్న సోనో విజన్ దసరా సేల్ ఆఫర్లు.!
Published on: Mon Oct 19, 2026 2:22PM

ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ రిటైల్ సంస్థ సోనోవిజన్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా దసరా సేల్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయదశమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్త గ్రాండ్ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ దసరా సేల్ ఆఫర్ లో భాగంగా ప్రజాదరణ పొందిన స్క్రాచ్ కార్డ్ స్కీమ్ ను 14వ తేదీ నుండి సంస్థ పునఃప్రారంభించింది. పండుగ కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు ఈ పథకం ద్వారా అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఖాతాదారులకు ఒక ఉచిత స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. ఈ స్క్రాచ్ కార్డ్ ద్వారా ఎంచుకున్న మోడళ్లపై 100 నుండి గరిష్టంగా రూ. లక్ష రూపాయల వరకూ తక్షణ నగదు బహుమతి గెలుచుకునే అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా.. ఫైనాన్స్ భాగస్వాముల ద్వారా చేసే కొనుగోళ్లపై దాదాపు 40 వేల రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్ ఆఫర్ల అందుబాటులోకి తీసుకువ్చింది. అలాగే క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ లావాదేవీలపై గరిష్టంగా 26 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సౌకర్యం అందుబాటులో ఉంది. పండుగ వేళ ఎస్బీఐ కార్డ్ వినియోగదారులకు పదివేల రూపాయల వరకూ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభించనుంది. కనీసం రూ. 20 వేల రూపాయల కొనుగోళ్లపై ఈ నెల అక్టోబర్ 10 నుండి వచ్చే నెల 15 వరకు ఈ డిస్కౌంట్ ప్రయోజనం వర్తిస్తుంది.
ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ఫోన్లు, అలాగే స్మార్ట్‌వాచ్‌లపై తక్కువ ధరల గ్యారెంటీని సోనో విజన్ ఇస్తోంది. వినియోగ దారులకు నమ్మకమైన సేవలతో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ సదుపాయాలను కూడా సమకూ రుస్తోంది. ఏటా దసరా సీజన్లో గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా జరిగే నేపథ్యంలో.. వినియోగ దారుల నుండి ఈ ఆఫర్లకు విశేష ఆదరణ లభిస్తున్నది. కొనుగోలుదారులకు గరిష్ట ఆర్థిక ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ పథకాలను రూపొందించినట్లు పోనొ విజన్ పేర్కొంది. విజయదశమి పండుగ వేళ నూతన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ దసరా సేల్ గొప్ప అవకాశం అని సోనోవిజన్ పేర్కొంది.
[Sonovision Dasara Sale Offers, Scratch Card Scheme, Festival Discounts, Electronics, Dasara Festive Offers, AP, Telangana, Cashback Schemes, Telugu One]


