TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ ప్రతిష్ఠ మసకబారిందా: రెండో వరుసలో సీటు సంకేతమేంటి.?

Published on: Tue Nov 17, 2026 4:44PM

 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.  

ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా?

సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.  

నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.!

రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​

[Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne]