TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుక్కలతో పాము ఫైట్

Published on: Wed Jan 18, 2023 10:27AM

మామూలుగా వీధికుక్కల ఫైట్ చూస్తూనే ఉంటాం. అయితే ఒక పాముతో వీధికుక్కలు వీరోచితంగా ఫైట్ చేసిన సన్నివేశానికి మాత్రం హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీ పార్క్ వేదిక అయ్యింది.

నాలా లోంచి బయటకు వచ్చిన పాము పరిసరాలలోని ఇళ్ల వైపు వెడుతుండగా గమనించిన రెండు వీధికుక్కలు దానిని అడ్డగించాయి. ఫైట్ చేశాయి. ఆ ఫైట్ లో పాము కాటుకు గురై ఒక కుక్క చనిపోయింది. అయినా సరే మరో కుక్క దానిని ఇళ్ల వైపు వెళ్ల కుండా అడ్డుకుంది.

చివరకు ఆ పామే.. యుద్ధం విరమించి పొదల్లోకి పాక్కుంటూ వెళ్లిపోయింది. ఈ ఫైట్ కు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్ అయ్యాయి.