Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీ ఆవరణలో పాము కలకలం
posted on: Mar 20, 2026 12:46PM
.webp)
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో పాము ప్రత్యక్షమైంది. అయితే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అప్రమత్తమై ధైర్యంగా పామును పట్టుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆవరణలో పాము కనిపించడంతో సిబ్బంది, అధికారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కాగా పామును ధైర్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 2009 బ్యాచ్‌కు చెందిన వెంకటేష్ నాయక్ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడటంలో ట్రాఫిక్ పోలీస్ వేగంగా స్పందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






