TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీమ్ ఇండియా మహిళా జట్టు కొత్త కెప్టెన్: లేడీ కోహ్లీ స్మృతి మంధాన.!

Published on: Wed Oct 7, 2026 9:59AM

టీమ్ఇండియా మహిళల క్రికెట్‌ కెప్టెన్ గా లేడీ కోహ్లీ స్మృతీ మంధానా నియమితురాలయ్యారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి వైదొలడంతో ఆమె స్థానంలో స్మృతీ మంధానాను టీమిండియా మహిళ జట్టు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఇప్పటివరకు జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మంధాన.. ఇక పూర్తి స్థాయి   స్కిప్పర్ గా కొనసాగనుంది.  స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు కొత్తేమీ కాదు. హర్మన్‌ప్రీత్ అందుబాటులో లేని సందర్భాల్లో ఇప్పటికే భారత్‌కు 18 టీ20లు, 4 వన్డేల్లో ఆమె కెప్టెన్‌గా వ్యవహరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ అనుభవం ఉన్న మంధానకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించడం జరిగింది.

దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ మంధానకు కెప్టెన్సీ అనుభవం ఉంది. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించిన ఆమె.. ఆ జట్టును 2024, 2026 సీజన్లలో టైటిళ్లకు చేర్చింది. ఈ అనుభవం కూడా జాతీయ జట్టు పగ్గాలు అప్పగించడంలో కీలకంగా మారింది.

కెప్టెన్‌గా నియమితులైన సందర్భంగా మంధాన స్పందిస్తూ.. భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం తనకు  ప్రత్యేకమైన గౌరవమని పేర్కొంది. బీసీసీఐ, సెలెక్టర్లు, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ భారత క్రికెట్‌కు అందించిన సేవలను మంధాన ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. ఆమె నాయకత్వంలో జట్టు అద్భుత విజయాలను సాధించిందని పేర్కొంది. ఇలా ఉండగా స్టార్ ఓపెనర్ గా స్మృతి మంధానాకు క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మహిళల క్రికెట్ జట్టుకు ఆమె కోహ్లీ వంటిదని అభిమానులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే స్మృతి మంధానా జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం. 

ఇక మంధాన కెప్టెన్సీలో భారత జట్టు తొలి సిరీస్‌ను జింబాబ్వేతో ఆడనుంది. అక్టోబర్ 16 నుంచి మూడు టీ20లు,   మూడు వన్డేల సిరీస్ లు జరగ నున్నాయి.   హర్మన్‌ప్రీత్ జట్టులో   కొనసాగుతుండటంతో.. అనుభవం, కొత్త నాయకత్వం కలయికగా భారత మహిళల జట్టు ముందుకు సాగనుంది.  

[Smriti Mandhana Team India Women Cricket New Captain, , Smriti Mandhana Captain, Harmanpreet Kaur, Indian Women Cricket, BCCI, Team India]