TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లేడీ కోహ్లీ.. స్మృతి మంధానా వరల్డ్ రికార్డ్.!

Published on: Mon Sep 21, 2026 9:59AM

మహిళల క్రికెట్ లో సూపర్ స్టార్ స్మృతి మంధాన అరుదైన ప్రపంచ రికార్డు సాధంచింది. మహిళల టీ20 క్రికెట్‌లో నంబర్‌ వన్‌ రన్‌-గెట్టర్‌గా చరిత్ర సృష్టించింది.  భారత మహిళా క్రికెట్ చరిత్రలో  స్మృతి మంధాన కొత్త రికార్డు సృష్టించింది.  ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన  సెమీఫైనల్ లో స్మృతి మంధాన ఈ  ఘనత  సాధించింది.  ఇప్పటి వరకూ న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ సుజీ బేట్స్ పేరిట ఉన్న  రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. 

 సుజీ బేట్స్ ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 4,758 పరుగులు సాధించగా, స్మృతి మంధాన ఆ రికార్డును  అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు  ఓపెనర్లు  స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే వ్యక్తిగత స్కోరు ఎనిమిది పరుగులు దాటగానే స్మృతి మంధాన వరల్డ్ రికార్డును బద్దలు  కొట్టింది.  

ఇప్పటివరకు మొత్తం 178 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధాన,   మొత్తం 4,788 పరుగులు చేసింది. ఇప్పటి వరకూ ఆ జాబితాలో  4,758 పరుగులతో  అగ్రస్థానంలో ఉన్న సుజీ బేట్స్ను సృతి మంధానా అధిగమించింది, భారత వన్డే, టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 4,327 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నది. 


[Smriti Mandhana, Women T20I record, India women cricket, Asian Games, Suzie Bates, most runs in T20Is]