TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరల్డ్ హీరో: ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం.!

Published on: Sun Oct 4, 2026 7:44AM

ప్రాణాలొడ్డి పోరాడి వందల మంది ప్రాణాలను కాపాడిన ఫ్లై దుబాయ్ విమానం పైలట్ కెప్టెన్ స్మిత మచ్చర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెడుతున్న   ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగా ఒమన్‌కు చెందిన కో పైలట్ హమామ్ అల్-హమామీ,  కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో   దాడికి తెగబడ్డాడు.

విమానాన్ని కూల్చివేయాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ అనూహ్య దాడి కారణంగా  రెండు నిమిషాల్లోనే విమానం 17 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు దిగిపోయింది. దీంతో వెంటనే హైజాకింగ్ డిస్ట్రెస్ సిగ్నల్ జారీ అయ్యింది. సహ పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా, కెప్టెన్ స్మిత్ మచ్చర్   ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు.  సర్వశక్తులు ఒడ్డి కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేశారు. దీంతో ఇతర ప్రయాణికులు లోపలికి దూసుకువచ్చి దాడికి పాల్పడిన కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్మిత్ మచ్చర్ ను వరల్డ్ హీరోగా అభివర్ణించారు.   బెంజమిన్ నెతన్యాహు స్వయంగా కెప్టెన్ మచ్చర్‌కు ఫోన్ చేసి 9/11 తరహా పెను విపత్తును  అసాధారణ ధైర్యంతో నివారించారని కొనియాడారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 'పవిత్ర జ్యోతిని వెలిగించాలని, నరేంద్ర మోదీతో పాటు కెప్టెన్ మచ్చర్‌ను ఆయన ఆహ్వానించారు. సాధారణంగా ఇజ్రాయెల్‌లో ఈ అత్యున్నత గౌరవం కేవలం ఆ దేశ పౌరులకు మాత్రమే దక్కుతుంది.

ఈ ఫోన్ సంభాషణలో ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటానని వెళ్లిన సహ పైలట్ తన తల వెనుక భాగంలో గొడ్డలితో తీవ్రంగా కొట్టాడని మచ్చర్ తెలిపారు. తొలి దెబ్బలకే తన కంటిచూపు దాదాపుగా మందగించిందని, అయినప్పటికీ తనలో మిగిలిన చివరి శక్తిని కూడగట్టుకుని డోర్ వైపు దూసుకెళ్లి తెరిచానని  వివరించారు. మచ్చర్ చూపిన సమయస్ఫూర్తి,  పోరాట పటిమ ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని నెతన్యాహు ప్రశంసించారు.


[Smith Macher, Benjamin Netanyahu, Indian Pilot, FlyDubai Flight, Israel Independence Day, Heroic Pilot,World Hero Telugu One]