హీరో పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్.!
Published on: Sat Oct 3, 2026 8:08PM

ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ఊహించని విపత్తు ముంచుకొచ్చిన వేళ, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ సాహసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ అనూహ్య ఘటనలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన తెగువ అసాధారణమైనది. ప్రయాణ సమయంలో కో-పైలట్ ఒక్కసారిగా విమానం కాక్‌పిట్‌లో దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలపాలైనప్పటికీ, స్మిత్ మచ్ఛర్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చాకచక్యంగా వ్యవహరించారు. విమానంలో మొత్తం 172 మందికి పైగా ప్రయాణికులు సిబ్బంది ఉండగా, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఆయన తీవ్ర రక్తస్రావమవుతున్నా కాక్‌పిట్ డోర్‌ను తెరిచి సకాలంలో సహాయం కోరారు.

ఈ ప్రమాద సమయంలో విమానం కేవలం 30 సెకండ్ల వ్యవధిలో సౌదీ అరేబియా గగనతలంపై 14,000 అడుగులకు పైగా కిందికి పడిపోయినట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ కాగా, అక్కడ ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను మెరుగైన వైద్యం కోసం అబుదాబికి తరలించారు.ఈ సాహసోపేత చర్యను గుర్తించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ యూఏఈ ఉప ప్రధాని షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా అబుదాబి ఆసుపత్రిని సందర్శించి కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి, తీవ్రమైన విపత్కర పరిస్థితులలోనూ ఆయన చూపిన అత్యున్నత స్థాయి ధైర్యం, బాధ్యతాయుత ప్రవర్తనను కొనియాడారు.
.webp)
మానవ జీవితాలపై ఆయన చూపిన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, యూఏఈ నాయకత్వం తరఫున పూర్తి కృతజ్ఞతలు ప్రశంసలు తెలియజేశారు. "మా బందంలో ఆయన భాగం కావడం మాకెంతో గర్వకారణం, మా దేశ చరిత్రలో ఆయన ఒక భాగం, అలాగే శాంతి, కరుణ, మరియు జీవన విలువలకు ప్రతీకగా నిలిచే మా దేశ ఆదర్శాలకు ఆయన నిలువెత్తు రూపం" అని షేక్ హందాన్ తన అధికారిక ప్రకటనలో మరియు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో స్మిత్ మచ్ఛర్ కేవలం సెకనులో వంతు భాగంలోనే తీసుకున్న తక్షణ నిర్ణయాలు వందలాది కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడాయని, ఆయన కుటుంబానికి దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
.webp)
[ Smit Machchhar, flydubai pilot, Sheikh Hamdan, Dubai Crown Prince, Indian hero pilot, cockpit attack incident, Flydubai FZ1073 flight, Nina Maneesh, TeluguOne news, Telugu News]


