ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు: సిట్ కస్టడీకి మాజీ మంత్రి కారుమూరి కుమారుడు.!
Published on: Wed Oct 14, 2026 12:08PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ ను కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీలోకి తీసుకుంది కోట్ల రూపాయల లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయిన వైయస్సార్సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
.webp)
మాజీ మంత్రి కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను సిట్ ధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న సిట్ పక్కా ఆధారాలతో దూకుడు పెంచింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో జరిగిన లిక్కర్ రవాణా కాంట్రాక్టులలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు సిట్ గుర్తించింది. నిబంధనల ప్రకారం అప్పట్లో కిలోమీటరుకు రవాణా ఛార్జీ కేవలం రూ. 13 మాత్రమే ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఏకంగా 35 రూపాయలకు పెంచి కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిట్ అధికారులు గుర్తించారు.
ఈ భారీ వ్యత్యాసం ద్వారా ప్రజాధనం ఏ విధంగా లూటీ అయిందనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. గతంలో ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కారుమూరి సునీల్ కుమార్ను అరెస్ట్ చేయగా, తాజాగా సిట్ అధికారులు ఆయనను కస్టడీకి తీసుకుని బ్యాంకు లావాదేవీలు, నిధుల మళ్లింపు , ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా గతంలో విజయవాడకు రప్పించి సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
[SIT Custody Karumuri Sunil Kumar, AP liquor Scam Case, Former Minister Karumuri Nageswararao Son, Telugu One]


