వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య.. రాజకీయ సన్యాసమేనా.?
Published on: Thu Nov 19, 2026 1:56PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. వయోభారం కారణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీలో దిగనని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన వచ్చే ఎన్నికల బరిలో తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు.
మొత్తంగా సిద్దరామయ్య ఈ ప్రకటన రాజకీయ సన్యాసానికి సంకేతమా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ హై కమాండ్ వద్ద పలుకుబడి తగ్గడం, ఇటీవల సోనియాగాంధీ ఆటోబయోగ్రఫి ది బిలాంగింగ్ ఆవిష్కరణ సభలో సిద్దరామయ్యకు ముందు వరుసలో చోటు దక్కకపోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ పరిశీలకులు సిద్దరామయ్య తాజా ప్రకటన ఆయన రాజకీయ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషిస్తున్నారు.
అయితే సోనియా పుస్కకావిష్కరణ కార్యక్రమంలో తాను వెనుక వరుసలో కూర్చున్న దృశ్యాలపై వస్తున్న విమర్శలు, ఊహాగానాలకు సిద్ధరామయ్య ఈ సందర్భంగా వివరణ ఇస్తూ, తాను వేదిక వద్దకు ఆలస్యంగా చేరుకోవడం వల్లే వెనుక సీటులో కూర్చోవాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు. పార్టీ నాయకత్వం తనను పక్కన పెట్టిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేద పునరుద్ఘాటించారు.

సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సిద్ధరామయ్య, ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలోనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి తన వయసు ఎనభై పైనే ఉంటుందని, గతంలో మాదిరిగా పూర్తి ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం, పోటీ బాధ్యతలు నిర్వహించడం కష్టతరమని ఆయన తాజాగా కూడా మీడియా సమావేశంలో పునరుద్ఘాటించారు. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పిడి, నాయకత్వ మార్పు అనంతర పరిణామాల నేపథ్యంలో సిద్ధరామయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సంబంధాలు, పార్టీలో సిద్ధరామయ్య ప్రాధాన్యత వంటి అంశాలను ప్రస్తావిస్తూ పరిశీలకులు సిద్దరామయ్య పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేసినట్లేనని విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బొటా బొటిగ గెలిచిన సిద్ద రామయ్య...
ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతారని ఆయన అభిమానులు చెబుతున్నప్పటికీ రాజకీయ సన్యాసం అన్న చర్చ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు 2028లో జరుగుతాయి. అందుకుఇంకా చాలా సయమం ఉన్నప్పటికీ సిద్దరామయ్య ఎన్నికలలో పోటీ చేసే అంశంపై స్పష్టత ఇవ్వడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీకి దూరం అన్న సిద్దరామయ్య ప్రకటనతో.. రానున్న రోజుల్లో సిద్ధరామయ్య క్రియాశీల రాజకీయాల్లో ఏ విధంగా కొనసాగుతారు, పార్టీ కార్యక్రమాలలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై కార్యకర్తలు, ప్రజల్లో చర్చోపచర్యలు జరుగుతున్నాయి. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని పునరుద్ఘాటించడం ద్వారా చేయడం ద్వారా సిద్ధరామయ్య తన వైఖరిపై ఎలాంటి సందిగ్ధత కుండబద్దలు కొట్టేసినట్లైంది.
మీకు నచ్చవచ్చు: కర్నాటకం.. సీఎం మార్పు ఖాయమేనా?
రసకందాయంలో కర్నాటకం.. సీఎం సిద్దరామయ్య రాజీనామా?
[Siddaramaiah, Karnataka, olitics, Election, Contest TeluguOne]


