శ్రేయస్ అయ్యర్ ఔట్: ఉద్వేగాన్ని ఆపుకులేక కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.!
Published on: Mon Oct 12, 2026 9:40AM

ఇండియాలో క్రికెట్ అంటే మతం. ఇండియాలో క్రికెట్ అంటే ఎమోషన్. టీమ్ ఇండియా విజయాలు దేశంలో పండుగలు. పరాజయాలు విషాదాలు. అంతగా క్రికెట్ ఇండియన్స్ తో పెనవేసుకుపోయింది. క్రికెట్ ఇంటే ఇండియాలో ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ విజయం, పరాజయం మాత్రమే కాదు. ఒక్కో బంతీ, ఒక్కో పరుగూ అభిమానులు హృదయానికి తీసుకుంటారు. అందుకే క్రికెటర్లపై వారి అభిమానానికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా అభినందిస్తారు. విరాట్ కోహ్లని కింగ్ కోహ్లీగా హృదయాలలో ప్రతిష్ఠించుకుంటారు.
అలాగే ఇతర ఇండియన్ క్రికెటర్లకూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉ:టారు. తమ అభిమాన ఆటగాడు సిక్సర్ కొడితే సంబరాలు చేసుకుంటారు. . అదే ఆటగాడు విఫలమై పెవిలియన్ కు చేరితే కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతగా ఇండియన్లకు క్రికెట్ కనెక్టయ్యింది. తాజాగా విండీస్ జట్టతో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది. అది పక్కన పెడితే.. టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.. కేవలం ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు.
దీంతో స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ఓ మహిళా అభిమాని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం క్రికెట్‌తో ఇండియన్స్ కు ఉన్న ఎమోషనల్ బాండ్ ఎంత బలమైనదో మరోసారి నిరూపించింది. శ్రేయస్ అయ్యర్ వికెట్ పడగానే దుఖం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న ఆ అభిమాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండోర్‌లో భారత్–వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్‌పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతకుముందు మ్యాచ్‌లో 102 పరుగులతో అజేయంగా నిలిచిన అయ్యర్.. ఈ మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తాడని భావించారు. అయితే వెస్టిండీస్ బౌలర్ రొస్టన్ చేజ్ బౌలింగ్‌లో అయ్యర్ కేవలం రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి లెగ్ బిఫోర్ వికెట్ గావెనుదిరిగాడు.
అయ్యర్ డీఆర్ఎస్ కు వెళ్లాడు. రీప్లేలో అయ్యర్ ఔట్ అయినట్లుగా తేలింది. దీంతో ఓ మహిళా అభిమాని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం కెమేరా కంటికి చిక్కింది. తన అభిమాన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ బ్యాట్ తో విఫలం చెందడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆమె తుడుచుకుంటున్న ఆమె కళ్ల నుంచి కన్నీటి ధారలు కారుతూనే ఉన్నాయి.
[Shreyas Iyer Fan Broken Into Tears, Shreyas Iyer Fan, Iyer Dismissal, India VS West Indies, 3rd T20, Emotion, India Cricket Bond, Telugu One]


