TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఛత్తీస్ గఢ్ లేడీ సింగం, ఐపీఎస్ అధికారి అంకితా శర్మకు షోకాజ్: కారణమేంటో తెలుసా?

Published on: Fri Oct 23, 2026 3:39PM

ఛత్తీస్‌గఢ్ లో  లేడీ సింగంగా గుర్తింపు పొందిన సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి, రాజ్‌నంద్‌గావ్ ఎస్పీ అంకితా శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆయుధ పూజ పేరుతో దసరా పర్వదినాన ఏకే 47తో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కారణంగా  సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి అంకితా శర్మకు ఛత్తీస్ గడ్ పోలీసు ప్రధాన కార్యాలయం గురువారం (అక్టోబర్ 22) షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాజ్‌నంద్‌గావ్ ఎస్పీ అంకితా శర్మ  దసరా రోజున జరిగిన ఒక సాంప్రదాయ ఆయుధ పూజ కార్యక్రమంలో భాగంగా  ఏకే-47 రైఫిల్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అంకితా శర్మ కాల్పుల ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. క్రమశిక్షణ, ఆయుధ నిర్వహణ నిబంధనలు, నియమాలకు విరుద్ధంగా ఆమె ఎకే 47 రైఫిల్ తో గాలిలోకి కాల్పులు జరిపారని పేర్కొంటూ ఆమెకు షో కాజ్ నోటీసు జారీ అయ్యింది.  అక్టోబర్ 20న పోలీస్ లైన్స్‌లో జరిగిన సాంప్రదాయ  స్త్ర పూజ అనంతరం అంకితా శర్మ ఏకే 47తో   కాల్పులు జరిపినట్లు రాజ్‌నంద్‌గావ్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అజయ్ యాదవ్ ధృవీకరించారు.

ఇలా ఉండగా ఆయుధ పూజ రోజు ఆమె ఎకే 47తో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరపడాన్ని పలువురు తప్పుపడుతున్నా.. అదే సంఖ్యలో ఆమె చర్యకు మద్దతు కూడా లభిస్తోంది. ఛత్తీస్ గడ్ లో ఇది సాధారణ సాంప్రదాయం అంటున్నారు. అయితే..  ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి బహిరంగంగా ఆయుధాన్ని నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా ఉపయోగించడం తగదని పలువురు అంటున్నారు.  ఉపయోగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  

[Show Cause Notice To IPS Officer Ankita Sharma,  AK47 Firing,   Chhattisgarh Police , Rajnandgaon SP Ankita Sharma, Chhattisgarh Police Department, Telugu One]