హైదరాబాద్ టు అమరావతి: బాబు విజన్, దక్షత.. శేఖర్ గుప్తా వాక్ ది టాక్ ఇంటర్వ్యూ.!
Published on: Thu Nov 12, 2026 8:37AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ను, ఆయన పాలనా దక్షతను ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తారు. రాజకీయ వైరంతో విమర్శలు గుప్పించినా, ఆ దార్శనికుడిని మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వచ్చిన, వస్తున్న గుర్తింపు, పెరిగిన, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారు సదా చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.
ఆ విషయాన్ని సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో నిర్వహించిన వాక్ ది టాక్ ఇంటర్వ్యూలో మరో సారి రుజువైంది. దాదాపు 23 ఏళ్ల కిందట శేఖర్ గుప్తా వాక్ ది టాక్ కార్యక్రమంలో చంద్రబాబును ఇంటర్వ్యూ చేశారు. . అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఆ ఇంటర్వ్యూ జరిగింది. రెండు దశాబ్దాలు దాటి మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే శేఖర్ గుప్తా, చంద్రబాబును ఇప్పుడు అమరావతి వేదికగా మళ్లీ ఇంటర్వ్యూ చేశారు. ప్లేస్ మారింది. చంద్రబాబు విజన్ మారలేదు. అప్పుడుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడుకున్న దృక్పథం, భవిష్యత్ ప్రణాళికలు, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆయన చూపుతున్న శ్రద్ధ, రచిస్తున్న ప్రణాళికలు ఆయన విజన్ మరింత పదును తేలిందని ఈ ఇంటర్వ్యూ నిర్ద్వంద్వంగా రుజువు చేసింది.
అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంబడి నడుస్తూ శేఖర్ గుప్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునుఇంటర్వ్యే చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజధాని నిర్మాణంపై తనకున్న స్పష్టమైన విజన్‌ను పంచుకున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి తాను వేసిన పునాదులను గుర్తు చేసుకుంటూనే, ఇప్పుడు అమరావతిని అంతకుమించిన ఆధునిక, భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను విపులంగా విశదీకరించారు.

ఈ ఇంటర్వ్యూలో బాబు విజన్, దార్శనికత, ప్రగతి, పురోగతి, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం పట్ల 23 ఏళ్ల కిందటి ఆలోచనల కొనసాగింపు.. తనను తాను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్ డేట్ చేసుకున్న తీరు స్పష్టంగా తేటతెల్లమైంది. సరిగ్గా ఇరవై మూడు ఏళ్ల కిందట, అంటే 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇదే జర్నలిస్టు శేఖర్ గుప్తాతో వాక్ ది టాక్ నిర్వహించారు. ఆ సమయంలో హైదరాబాద్ నగరాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చంద్రబాబు తన ప్రణాళికలను వివరించారు. ఇప్పుడు మళ్లీ అదే శేఖర్ గుప్తాకు వాక్ ది టాక్ అంటూ అమరావతి వీధుల్లో నడుస్తూ మరో ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఎదురైన అడ్డంకులు, ఇప్పుడు తన హయాంలో ఆ అడ్డంకులన్నిటినీ అధిగమించి గాడిన పెడుతున్న తీరును, రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగం వంటి అంశాలను చంద్రబాబు వివరించారు.
ఇది కూడా చదవండి: రాజకీయం అంటే తొడలు చరిచి సవాళ్లు విసరడం కాదు.. చంద్రబాబు.!
ఒక నగరం, ఒక రాజధాని అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టే భవనాలు మాత్రమే కాదని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒక సంపద సృష్టి కేంద్రంగా మార్చాలనే తన లక్ష్యాన్ని చంద్రబాబు వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై తన విజన్ వివరించారు. ఇరవై మూడు సంవత్సరాల కిందట చార్మినార్ వద్ద శేఖర్ గుప్తా చంద్రబాబుతో జరిపిన ముఖాముఖీ ఇంటర్వ్యూ అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత హైదరాబాద్ సాధించిన అద్భుతమైన ప్రగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ 23 ఏళ్ల తరువాత అమరావతిలో చంద్రబాబుతో శేఖర్ గుప్తా జరిపిన సంభాషణపై ఈ సారి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమౌతోంది.

నాడు హైదరాబాద్ విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలు ఏ విధంగా నిజమయ్యాయో, ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అలాగే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబులోని ఉత్సాహం, పనితీరులో వేగం ఇరవై మూడేళ్ల కిందటితో పోలిస్తే మరింత ఇనుమడించాయని అంటున్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ప్రాసారం కానప్పటికీ ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి. వాటి ద్వారా అమరావతి అభివృద్ధి, ఆధునిక నగర నిర్మాణం ఇందుకోసం చంద్రబాబు ప్రణాళికలు, భవిష్యత్ నగరంగా అమరావతి ఠీవీగా, రాష్ట్ర ప్రతిష్ఠనే కాకుండా దేశ ప్రతిష్టను సైతం పెంచుతుందని విస్పష్టంగా తేటతెల్లమైందని మేధావులు అంటున్నారు. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ అభివృద్ధి ప్రస్థానం, నేడు అమరావతి వీధుల గుండా కొత్త చరిత్ర సృష్టించేలా సాగుతోందని అవగతమౌతోంది. వేదికలు మారినా, కాలం గడిచినా, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం మరింత ధృఢతరంగా మారిందని ఈ ఇంటర్వ్యూ రుజువు చేసేలా ఉందనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
మీకు నచ్చవచ్చు: ది లీడర్.. ది లెజండరీ, ది స్టేట్స్ మన్.. ఒకే ఒక్కడు నారా చంద్రబాబు
1995 సెప్టెంబర్ 1 నుంచి చంద్రబాబు ప్రస్థానం... నిజంగా ఒక అద్భుతం.!
[Shekhar Gupta, Nara Chandrababu Naidu, Walk The Talk, Amaravati Vision, TeluguOne]


