TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ విదేశీ పర్యటన: శశిథరూర్ వ్యాఖ్యలు వైరల్.!

Published on: Thu Oct 22, 2026 11:59AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన విలక్షణ శైలితో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ముఖ్యంగా కాంగ్రస్ నాయకుడైన ఆయన తరచుగా పార్టీ లైన్ ను దాటి వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు. ప్రధాని మోడీని ఆకాశానికెత్తడంలోనూ, సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడంలోనూ ఆయన ముందుంటారు. అయితే తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదనీ, తన వ్యాఖ్యలు, విమర్శలు, పొగడ్తలూ అన్నీ అంశాల ప్రాతిపదికనే (Issue based)ఉంటాయని చెప్పుకుంటుంటారు.  

అటువంటి శథి థరూర్.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్  కీలక నేతల వ్యక్తిగత,  అధికారిక ప్రయాణాల షెడ్యూల్స్ గురించి ప్రతి ఒక్కరి వద్ద సమాచారం ఉండదంటూ ఆయన అన్యాపదేశంగా చెప్పారు. 

 రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ఎప్పుడు ఉంటుందంటూ  ఓ విలేకరిశశిథరూర్ ను ప్రశ్నించారు. దీనిపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఒకింత చమత్కారంగా  తాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడినే కానీ, పార్టీ నేతల  వ్యక్తిగత ప్రయాణాలను పర్యవేక్షించే ట్రావెల్ ఏజెంటును కానీ, ఏజెన్సీని కానీ కాదని  బదులిచ్చారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఎక్కడికి వెడతారో తనకెలా తెలుస్తుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు శశిథరూర్ రాహుల్ విదేశీ పర్యటనపై చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.  అలాగే ఇందుకుసంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.   

[Shashi Tharoor On Rahul Gandhi Foreign Trip,  Travel Agent Comments, Shashi Tharoor Viral Video, Telugu One]