TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్: రూ.1.20 కోట్ల గోల్డ్ స్వాధీనం.!

Published on: Mon Oct 5, 2026 11:58AM

తెలంగాణలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.  అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.

 తిరుచ్చిరాపల్లి నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. 

 హైదరాబాద్‌కు చెందిన స్థానిక నగల వ్యాపారిగా ఆ వ్యక్తిని అధికారులు గుర్తించారు. పకడ్బందీగా ఎవరికీ   అనుమానం రాకుండా తన లగేజీలో ఈ బంగారాన్ని దాచిపెట్టి తరలిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అధికారులు అతడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా,  800 గ్రాముల బంగారు ఆభరణాలు అక్రమంగా తరలిస్తున్నట్లు బయటపడింది. మార్కెట్ విలువ ప్రకారం అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోటీ 20 లక్షల రూపాయలు అని అధికారులు అంచనా వేశారు. 


[Shamshabad Airport Gold Seizure, DRI Officials Raid, Hyderabad Jeweler Arrested,  Tiruchirapalli Flight, Telugu One]