రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం.!
Published on: Sat Sep 19, 2026 9:29AM
.webp)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో శనివారం (సెప్టెంబర్ 19) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొని తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కారులో ప్రయాణిస్తూ తమ సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యంలో శంషాబాద్‌లోని పాలమాకుల వద్దకు వచ్చేసరికి.. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిని 54 ఏళ్ల కేతవత్ లింబ్యా), ఆయన భార్య 45 ఏళ్ల కేతవత్ జమున, 48ఏళ్ల కత్రొవత్ మానసింగ్, 45 ఏళ్ళ కేతవత్ వాస్రామ్ గా గుర్తించారు.
.webp)
మృతులలో ముగ్గురు వ్యాపార రంగంలో ఉండగా, జమున గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.
[Shamshabad Accident, Hyderabad Road Accident, Car Hit Culvert, Four Killed, One Family, Palamakula Accident, Telangana news, Telugu One]


