షాదాబ్ బిరియానీ సెంటర్ సీజ్.!
Published on: Thu Sep 3, 2026 12:59PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేప్టీ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని అనేక రెస్టారెంట్లలో పరిశుభ్రత ప్రమాణాల విషయంలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీలు ఎక్కువగా పరిశుభ్రత లోపాలపై హెచ్చరికలు జారీ చేయడానికే పరిమితమయ్యాయి. అయితే.. చర్యల దిశగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అడుగులు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ పై ఫుడ్ సేష్టీ అధికారులు చర్య తీసుకున్నారు. హైదరాబాద్ బిర్యానీకి చిరునామాగా గుర్తింపు పొందిన షాదాబ్ బిర్యానీ కేంద్రంపై ఫుడ్ సేప్టీ అధికారులు దాడి చేసి సీజ్ చేశారు.

షాదాబ్ బిర్యాణీ కేంద్రంలో ఆహార పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని, అలాగే బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
షాదాబ్ బిర్యానీ కేంద్రం భవనంలోని కొంత భాగం రోడ్డు ఆక్రమణల కిందకు రావడంతో మున్సిపల్ అధికారులు గతంలో వాటిని తొలగించిచారు. ఇప్పుడు ఆహార భద్రతా అధికారులు రంగంలోకి దిగి షాదాబ్ బిర్యానీ సెంటర్ ను సీజ్ చేశారు.
[Shadab Biriyani Center Seized, Food Safety, Quality Standards, Expired, Ingredints]


