Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డబ్ల్యుపీఎల్ లో తొలి సెంచరీ.. బ్రంట్ రికార్డ్
posted on: Jan 27, 2026 12:45PM

విమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా నాట్ సీవర్ బ్రంట్ రికార్డు సృష్టించింది. ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సీవర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లోనే శతకబాది.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీపై సునాయాస విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయిట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకు వెళ్లింది.
కాగా ఈ మ్యాచ్ లో పరాజయం పాలైనా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. అయితే ఆర్సీబీకి వరుసగా ఐదు విజయాల తరువాత వరుసగా ఎదురైన రెండో ఓటమి ఇది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ సీవర్ బ్రంట్ సెంచరీ పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ 15 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.


.webp)
.webp)


