TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సికింద్రాబాద్‌లో.. లారీ బరువుకు కుప్పకూలిన జంక్షన్ పైకప్పు.!

Published on: Sun Oct 4, 2026 4:50PM

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాటర్ వర్క్స్ జంక్షన్ వద్ద ఉన్న పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ జంక్షన్ పైకప్పుపై నుంచి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

లారీ బరువును తట్టుకోలేక పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో.. భారీ నిర్మాణ శిథిలాలు లారీ చుట్టూ పడిపోయాయి. దీంతో లారీ జంక్షన్‌లోనే ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా నిర్మాణం కూలిపోవడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలిస్తూ.. జంక్షన్‌లో చిక్కుకున్న లారీని సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళ్లడంతోనే పైకప్పు కూలిందా? లేదా నిర్మాణం బలహీనంగా ఉండటమే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.

 

 

 

[ Secunderabad, Water Works Junction, Cantonment, Junction Roof Collapse, Lorry Accident, Hyderabad Accident, Telangana, Road Accident, Roof Collapse, Heavy Vehicle Accident ]