కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి : సతీష్ మాదిగ
Published on: Wed Sep 9, 2026 5:23PM

సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ మాల మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ మాదిగ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితు లను అవమానించేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ కుటుంబ సభ్యురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సతీష్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ తాము మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద డప్పు చప్పుళ్లతో నిరసన చేపట్టామని తెలిపారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లే రహదారులపై దళితులమైన తాము నడిచిన అనంతరం ఆ ప్రాంతాన్ని కేసీఆర్ తన అనుచరులతో పసుపు నీళ్లతో శుద్ధి చేయించారని సతీష్ మాదిగ ఆరోపించారు. దళితులు నడవడం వల్ల నేల మలినమైందనే భావనతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దళితులంటే కేసీఆర్‌కు చిన్న చూపు ఉందని సతీష్ మాదిగ ఆరోపించారు. ఆయన ప్రోత్సాహంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహ రించిన కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కేసీఆర్ చర్యలకు నిరసనగా ఆయన హయాంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తా మని సతీష్ మాదిగ ప్రకటించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఈ విషయంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తా మని స్పష్టం చేశారు.
(SC, ST atrocity case should be filed against KCR, Satish Madiga, Erravalli Farmhouse, BRS MLC Tata Madhu, CM Revanth reddy, KTR, CP Sajjanar, DGP C,V, Anand, Telugu One, Telugu News)


