TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చేతులు మారిన ప్రముఖ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానెల్..!

Published on: Thu Sep 10, 2026 7:56PM

త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?

తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉన్న ఓ శాటిలైట్ న్యూస్ ఛానెల్ యాజమాన్యం చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న ఓ కీలక నేత ఈ ఛానెల్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం.

దేశంలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ శాటిలైట్ న్యూస్ ఛానెల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంతో పాటు.. రాజకీయ పరిణామాలపై కూడా మీడియా సంస్థల ప్రభావం గణనీయంగా ఉంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది.

తెలుగులో ఇప్పటికే అనేక శాటిలైట్ న్యూస్ ఛానెల్స్ ఉన్నప్పటికీ.. వాటిలో కొన్ని ఛానెల్స్ మాత్రమే లీడింగ్ పొజిషన్‌లో కొనసాగుతున్నాయి. అలాంటి ప్రముఖ ఛానెల్స్‌లో ఒకటిగా చెప్పుకునే ఛానెల్‌నే ఇప్పుడు అధికారంలో ఉన్న ఓ కీలక నేత కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం కూడా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సదరు కీలక నేతకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి.. గతంలో ఓ న్యూస్ ఛానెల్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి.. ఇప్పటికే కొత్త యాజమాన్యం తరఫున సదరు ఛానెల్ బోర్డులోకి వెళ్లినట్టు సమాచారం.

అయితే.. ఈ యాజమాన్య మార్పుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఛానెల్‌ను ఎవరు కొనుగోలు చేశారు? ఎంత మొత్తానికి ఈ డీల్ జరిగింది? కొత్త యాజమాన్యం ఎలాంటి మార్పులు చేయబోతోంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

కొత్త యాజమాన్యం అధికారికంగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తుంది? కార్యకలాపాలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది? ఛానెల్‌ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

 

 

[ Satellite News Channel, Telugu News Channel, Telugu States, Telangana Politics, Andhra Pradesh Politics, Media Ownership, Channel Acquisition, News Channel Deal, Media Industry, Political Influence, New Management, Breaking News, Telugu Media, News Channel Management, Media Business, Channel Board, TV News, Media Updates ]