TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమ్మక్క, సారక్క గుడి కూల్చివేత: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుండగుల దుశ్చర్య.!

Published on: Wed Oct 21, 2026 9:53AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అనంతోగు గ్రామ పంచాయతీ శివారు ప్రాంతంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క-సారక్క గుడిని దుండగులు ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి కారణమైంది.  స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ శివారులో వెలసిన ఈ ఆలయంలో  స్థానికులు నిత్యం పూజలు చేస్తుంటారు. అటువంటి  సమ్మక్క-సారక్క గద్దెలను, గుడిని కూల్చివేత పట్ల  భక్తుు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న  స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు.  

ఈ ఘటనపై క పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి  చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు  డిమాండ్ చేస్తున్నారు. 

[Sammakka Sarakka Temple Destroyed Ananthogu, Bhadradri Kothagudem District, Destruction Sammakka Sarakka Temple, Telugu One]