TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీబీఐకి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు: ఏపీ హైకోర్టు తీర్పు.!

Published on: Fri Oct 16, 2026 2:51PM

ఆంధ్రప్రదేశ్ లో  సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో  హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ లాకప్ డెత్ కేసులో   సమగ్ర,  నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆదేశిస్తూ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం కేవలం దర్యాప్తును మార్చడమే కాకుండా, బాధితురాలైన మృతుడి తల్లి గాదె విజయలక్ష్మికి నాలుగు వారాలలోగా పాతిక లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఆదేశించింది.  

సీబీఐ  రంగంలోకి దిగడంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు  వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఈ తీర్పుతో సాయికృష్ణ కుటుంబానికి  న్యాయం జరుగుతుందని అంటున్నారు. సీబీఐ దర్యాప్తు ఏ దశలో ముందుకు సాగుతుంది, బాధ్యులపై ఎలాంటి చట్టపరమైన సెక్షన్ల కింద అభియోగాలు నమోదవుతాయి అనే విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  


[Saikrishna Custodial Death Case CBI, High Court Verdict, CBI Investigation, Andhra Pradesh, Compensation, Telugu One]