Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అయ్యోపాపం.. ఇంగ్లాండ్ క్రికెట్ కు ఎంత కష్టం వచ్చింది!
posted on: Mar 20, 2026 3:26PM

యుద్ధం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలపైనే కాదు.. క్రీడారంగంపై కూడా పెను ప్రభావం చూపుతోంది. ఇప్పుడు యుద్ధ ప్రభావం ఇంగ్లాండ్ క్రికెట్ కు చచ్చే చావు తెచ్చిపెట్టింది. ఇంగ్లాండ్ క్రికెట్ కు ఈ కష్టం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రకటించిన యుద్ధం వల్ల కాదు.. గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇంగ్లాండ్ క్రికెట్ ను కష్టాల్లో ముంచేయడమేంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా ఆగండి..
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం సెగ ఇంగ్లాండ్ క్రికెట్‌ను బలంగా తాకింది. ఇంగ్లాండ్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక కౌంటీ క్రికెట్ మ్యాచ్‌లకు డ్యూక్స్ క్రికెట్ బంతులను వినియోగిస్తారు. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ఆ డ్యూక్ బంతుల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులలో డ్యూక్ బంతులు వినా మరే క్రికిట్ బాల్స్ బౌలర్లకు సహకరించే అవకాశం లేదు. పరిస్థితుల్లో డ్యూక్స్ బంతులు బౌలర్లకు యాప్ట్ గా ఉంటాయి. స్వింగ్, సీమ్ లకు ఈ బంతులు అయితేనే సహకారం ఉంటుంది. అటువంటి డ్యూక్ బంతుల తయారీకి అవసమయ్యూ ముడి సరుకు రష్యా నుంచి దిగుమతి అవుతుంది. అయితే యుద్ధం కారణంగా అమలులో ఉన్న ఆంక్షల కారణంగా రష్యా నుంచి ఈ ముడిసరుకు దిగుమతి నిలిచిపోయింది. దీని కారణంగా డ్యూక్ క్రికెట్ బంతుల తయారీ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సహజంగానే వాటి లభ్యత గగనమైంది.
ఈ డ్యూక్ బంతులను బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ సంస్ధ తయారు చేస్తుంది. నాణ్యత విషయంలో ఇసుమంతైనా రాజీ లేకుండా ఈ బంతుల తయారీ ఉండటంతో ఈ డ్యూక్ బంతులకు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని డమాండ్ ఉంది. అయితే ఆ డిమాండ్ కు అనుగుణంగా సంస్థ డ్యూక్ బంతులను ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో పడింది. దీంతో ఇంగ్లాండ్ లో కౌంటీ చాంపియన్ షిప్ లీగ్ స్థాయి పోటీలపై తీవ్రంగా పడింది. లీగ్ మ్యాచ్ ల నిర్వహణకు బంతుల కొరత ఎదురైంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డ్యూక్ బంతుల తయారీ దారులతో సంప్రదింపులు జరుపు తున్నారు. అదే సమయంలో ఉన్న డ్యూక్ బంతుల స్టాక్ ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని క్రికెట్ క్లబ్ లను ఆదేశిస్తున్నారు.



.webp)


