కాషాయం స్థానంలో మువ్వన్నెల జెండా!

ఆర్ఎస్ఎస్ తన ప్రొఫైల్ పిక్ ను మార్చేసింది. సామాజిక మాధ్యమంలో ఆర్ఎస్ఎస్ ప్రొఫైల్ పిక్ ఇంత కాలం కాషాయ జెండా ఉండేది. కానీ శుక్రవారం( ఆగస్టు 15) ఆ ప్రొఫైల్ పిక్ మారిపోయింది. కాషాయ జెండా స్థానంలో జాతీయ జెండా కనిపించింది.

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా మోడీ పిలుపును అనుసరించి తన ప్రొఫైల్ పిక్ ను మార్చేసింది.  ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ గా మువ్వన్నెల జెండాను ఉంచాలని నరేంద్ర మోదీ ప్రజలను పిలుపు నిచ్చిన సంగతి విదితమే.

 గతంలో ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను గురించి కాంగ్రెస్ పార్టీలో పలు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్ మార్చాలని సూచించిన సమయంలో కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేశారు.

52 ఏళ్లుగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఎగరని జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుంటారా..?   కాంగ్రెస్ నేత జైరాం రమేష్ నిలదీశారు. దీంతో ఆ విమర్శలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ తన సామాజిక మాధ్యమ ప్రొఫైల్ పిక్ ను కాషాయ జెండా నుంచి జాతీయ జెండాకు మార్చేసిందని భావిస్తున్నారు. హ