మునుగోడుకు అమిత్ షాపై బండి ఏమన్నారంటే..!?

అమిత్ షా మునుగోడు సభ వాయిదా పడిందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 21న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడులో భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అమిత్ షా సమక్షంలో మునుగోడులో కమలం గూటికి చేరుతారని బండి క్లారిటీ ఇచ్చారు. మునుగోడు సభ కోసం అమిత్ షాకు రెండు తేదీలు ప్రతిపాదించామని బండి వివరించారు. ఆగస్టు 21, ఆగస్టు 29 తేదీలను ఆయనకు సూచించగా.. ఆయన 21 వ తేదీని ఎంచుకున్నారని, దీంతో ఈనెల 21న మునుగోడులో అమిత్ షా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారనీ బండి స్పష్టత ఇచ్చారు.  

ఇలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. బీజేపీ చేరికల కమిటీ నియోజకవర్గంలో  టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ నేతలు గాలం వేయడంలో యాక్టివ్ అయ్యింది. అలాగే అమిత్‌ షా నుంచి బండి సంజయ్‌ వరకు ఇప్పుడు అందరూ  మునుగోడు పైనే  దృష్టి కేంద్రీకరించారు. కేంద్రీకరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో   మండలాలు,   మున్సిపాలిటీలలో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తున్నది.  

మునుగోడు ఉప ఎన్నికను కేంద్ర పార్టీ నేరుగా పర్యవేక్షిస్తోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మరో వైపు   కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడులో పాదయాత్రతో రంగంలోకి దిగారు. ఈ నెల 16 నుంచి గ్రామాల వారీగా రచ్చబండ ను కాంగ్రెస్ నిర్వహించనుంది. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఒక రోజు తేడాలో  జరుతుండటం మునుగోడులో రాజకీయం రసకందాయంలో పడింది.