TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు: దేవినేని అవినాష్ పై రౌడీ షీట్.!

Published on: Wed Sep 23, 2026 12:22PM

వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ పై విజయవాడ పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు. గతంలో తెలుగుదేశం కేంద్ర కార్యాలంపై దాడి కేసులో దేవినేని అవినాష్ సహా మొత్తం 51 మందిపైరౌడీ షీట్లు ఓపెన్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.  విధ్వంసాలకు దిగే వారిని ఇసుమంతైనా ఉపేక్షించేది లేదన్న బలమైన సంకేతం ఇచ్చేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

తాజాగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన.. ఉపాధ్యాయులపై దాడుల వ్యవహారం పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన వైసీపీ ముఖ్యులతో సహా మొత్తంగా 51 మంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ 51 మందిలో దేవినేని అవినాష్, తలసిల రఘురామ్ ఉన్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2021లో మంగళగిరిలోని తెలుగుదేశం  కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుపై విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి  తాజాగా వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ సహా 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి ఘటనలో దేవినేని అవినాష్ ఉండటంతో ఇక ఇసుమంతైనా ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

{Rowdy Sheet, Devineni Avinash, Talasila, Ycp, Leaders, Tdp Office Attack, Telugu One}